NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేవనకొండ బస్టాండ్ పై ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వీడాలి

1 min read

బస్టాండ్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలి… డివైఎఫ్ఐ 

పత్తికొండ, న్యూస్​ నేడు:  కర్నూలు        జిల్లాలోని పత్తికొండ డిపో పరిధిలో అత్యంత రద్దీతో కూడిన బస్టాండు దేవనకొండ బస్టాండ్ అని, అయితే ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా స్థానిక ఆర్టీసీ బస్టాండు దుర్గంధ మయంగా, పశువులకు ఆవాసంగా మారిందని, టాయిలెట్స్, తాగునీటి సౌకర్యం పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందని దీనికి బాధ్యత ఆర్టీసీ అధికారులు దేనని భారత ప్రజాతంత్ర యువజన సంఘం (డివైఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి అబ్దుల్లా ఆ సంఘం మండల కార్యదర్శి మహేంద్రలు విమర్శించారు.బుధవారం నాడు స్థానిక బస్టాండ్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ,  డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆ సంఘం మండల నాయకులు జి నాగేంద్ర అధ్యక్షతన రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేవనకొండ బస్టాండ్ నందు ప్రయాణికుల శాతం ఎక్కువగా ఉండే ప్రాంతం దేవనకొండ బస్టాండ్ అని,దేవనకొండ బస్టాండ్ నుండి రోజువారీగా వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు జరుగుతుంటాయనీ చాలా రద్దీగా ఉండే బస్టాండు అయిన దేవనకొండలో మౌలిక సదుపాయాలు మాత్రం  శూన్యంగా ఉంటున్నాయని వారు విమర్శించారు.ఆర్టిసికి ఆదాయం సమకూర్చే ప్రాముఖ్యత గల బస్టాండులో మౌలిక సదుపాయాలు కనీస  వసతులు చాలా అద్వానంగా ఉన్న పరిస్థితి నెలకొందని. కూర్చోవడానికి ఏమాత్రం బస్టాండ్లో అనుకూలంగా లేక దుమ్ము, దూళి, దుర్గంధమైన వాసనతో బస్టాండ్ భయంకరంగా ఉంటుందనీ పేర్కొన్నారు. అదేవిధంగా బాత్రూమ్, టాయిలెట్స్, పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటాయనీ, ఈ మధ్య వీటిని మూసివేశారనీ తెలిపారు బస్టాండ్  లోకి పోవాలంటే ప్రయాణికులకు నరకం లాంటి ఫీలింగ్ ఉంటుంది.

About Author