NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భూముల రీ- సర్వే పారదర్శంగా జరగాలి

1 min read

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్  వెల్లడి

 ఆర్డీవో అచ్యుత్ అంబరీష్ సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : పెదవేగి మండలంలో జరుగుతున్న భూముల రిసర్వేలను ఏలూరు ఆర్డీవో అచ్యుత అంబరీష్  తో కలిసి దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్  బుధవారం ఉదయం దుగ్గిరాలలోని పంచాయతీ కార్యాలయం వద్ద సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా భూముల రీ సర్వే అంశంపై పలువురు గ్రామస్థులు తమ సందేహాలను వ్యక్తపరచగా అధికారులు వాటిపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ “గత వైసిపి ప్రభుత్వంలో జరిగిన అస్తవ్యస్త విధానాలు, పాలన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన భూముల రీ సర్వే కార్యక్రమం ద్వారా ఎంతో పారదర్శకంగా అమలు చేస్తూ వివాదరహితంగా ప్రజలు జీవించేలా పాలన అందిస్తుందని, ఈ కార్యక్రమం పట్ల ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా అధికారులు కూడా ఎక్కడ ఎలాంటి విమర్శలకు తావులేకుండా భూముల రీ సర్వే పూర్తి చేయాలని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్  సంబంధిత అధికారులకు, సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో పెదవేగి మండల తాసిల్దార్ భ్రమరాంబ సహా పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author