ప్రజలకు పారదర్శక పాలన అందించడంలో ఆర్టిఐ చట్టం కీలకపాత్ర వహిస్తుంది
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ప్రభుత్వ వ్యవస్థలు బాధ్యతాయుతంగా పనిచేయడానికి ఆర్టిఐ చట్టం ఉపయోగపడుతుందని ప్రజలు తమ హక్కులను తెలుసుకొని వాటిని సద్వినిగా పరుచుకోవాల్సిన అవసరం ఉందని ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఆర్టీఐ చట్టం ఏర్పడి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆర్ టి ఐ చట్టం పై ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నాగ స్వామి నాయక్ అధ్యక్షతన జరిగిన అవగాహన కార్యక్రమంలో పలువురు వక్తలు అన్నారు . ఆర్టిఐ సమాచారం కొరకు దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనే అంశంపై అడ్వకేట్ రవికుమార్ వివరించారు. లీగల్ సర్వీసెస్ యూనిట్ మెంబర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలు ఈ చట్టాన్ని ఉపయోగించవచ్చు అని పారదర్శకత్వం పెరిగితే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా యువత ఈ చట్టంపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని, కావలసిన సమాచారాన్ని అందించడంలో అందించడంలో అధికారులు సహకరించాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ నాగ స్వామి నాయక్ మాట్లాడుతూ డిజిటల్ యుగంలో ఆన్ లైన్ ఆర్టిఐ సేవలు ప్రజలకు మరింత సౌలభ్యాన్ని కలిగిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

