NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సావిత్రిబాయి పూలే జయంతిని ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకోవాలి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఈ దేశానికి అక్షరాల దీపికలు అందించిన మన దేశపు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకోవాలని దామోదరం సంజీవయ్య జిల్లా సాధన సమితి గౌరవ అధ్యక్షులు నక్కల మిట్ట శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మహిళలకు, శూద్రులకు విద్యను నిరాకరించిన వ్యవస్థను ధ్వంసం చేసి దేశాన్ని జ్ఞానం వైపు నడిపించిన గొప్ప సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని సంజీవయ్య జిల్లా సాధన సమితి కార్యదర్శి దాసరి రామసేసయ్య, కన్వీనర్ జెవి కృష్ణయ్య, గౌరవ సలహాదారు దామోదరం రాధాకృష్ణమూర్తి, సభ్యులు నాగభూషణం, సివి వర్మ, పాండు, మల్లికార్జున్ తదితరులు అన్నారు.

About Author