NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోలీస్, రెవెన్యూ ఆధ్వర్యంలో 164 టన్నులు పంపిణీ

1 min read

మహానంది, న్యూస్​ నేడు:  పోలీస్, రెవెన్యూ శాఖ ల ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ యూరియాను పంపిణీ చేశారు. మహానంది మండలంలోని వివిధ రైతు సేవా కేంద్రాల కు 164 టన్నుల యూరియా శుక్రవారం విడుదల అయినట్టు వ్యవసాయ శాఖ ఏవో నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు . వాటి  పంపిణీ రైతులకు శుక్రవారం నుండే చేపట్టమన్నారు. పొలానికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు సమర్పించిన రైతులకు ఒక్కొక్క రైతుకు రెండు బస్తాల చొప్పున ఆయా గ్రామాల లోని వ్యవసాయ శాఖ సిబ్బంది శుక్రవారం రాత్రి వరకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మిగిలిపోయిన రైతులకు శనివారం ఉదయం పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి తెలియజేశారు.

About Author