NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థిపై దాడి చేసిన ఫిజికల్ డైరెక్టర్ ను సస్పెండ్ చేయాలి

1 min read

విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరించిన హెచ్.ఎం పై చర్యలు తీసుకోవాలి…

పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర బాబు డిమాండ్…

ఎమ్మిగనూరు న్యూస్ నేడు : గోనెగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పద  వ తరగతి విద్యార్థి పై దాడి చేసిన ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)  జాకీర్ హుస్సేన్ ను సస్పెండ్ చేయాలి అని ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్ధి సంఘం(పి.డి.ఎస్.యు)  జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మహేంద్ర బాబు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక పట్టణంలో విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ   పదవ తరగతి చదువుతున్న  విద్యార్థి పై విచక్షణంగా దాడి చేసి విద్యార్థి చేయి విరగొట్టడం చాలా దుర్మార్గమని అన్నారు. విద్యార్థిపై దాడి చేయడం దాడిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రోత్సహించడం చాలా సిగ్గుచేటు అని అన్నారు.విద్యార్థి చేసిన కారణం తో విద్యార్థిపై దాడులు చేయడం దారుణమన్నారు.విద్యార్థిపై దాడి చేసి విద్యార్థి భవిష్యత్తు ను నాశనం చేసిన ఫిజికల్ డైరెక్టర్ జాకీర్ హుస్సేన్ ను తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో పెద్ద ఎత్తున  ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో పి.డి.ఎస్.యు నాయకులు నరసింహ రెడ్డి, కుల్లయ్య, లక్ష్మణ్, బన్నీ, మధు, లోకేష్, ధనుష్ తదితరులు పాల్గొన్నారు.

About Author