సమయపాలన పాటించని సచివాలయం ఉద్యోగులు
1 min read

ఇబ్బందులు పడుతున్న ప్రజలు
11 గంటలైనా తెచ్చుకొని సచివాలయం తలుపులు
సర్వేలో విధులు నిర్వహిస్తామన్న ఉద్యోగస్తులు
తూతు మంత్రంగా తనిఖీ నిర్వహిస్తున్న అధికారులు
ప్యాపిలి న్యూస్ నేడు: ప్రజల వద్దకే పాలన ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలని ప్రభుత్వాలు తమ గ్రామంలోనే సచివాలయాలు నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కారం చేయాలని నిర్వహిస్తే సచివాలయం ఉద్యోగులు మాత్రం సమయాపాలన పాటించలేదు.ప్రజలకు సేవలందించే సచివాలయాలు 11 అయినా వేసిన తాళాలు వేసినట్లు ఉన్నాయి కానీ తెరవలేదు, ప్రజలు తమ పనులను నిర్వహించుకోవాలని వస్తే సచివాలయాలకు తాళాలు వేశారని, మా సమస్యలు పరిష్కారమే కాలేదని పోతున్నారు.ప్యాపిలి మండల పరిధిలోని పెద్దపూజర్ల గ్రామ సచివాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలైనా సచివాలయం తెలుసుకొగ తాళాలు వేశారు. సమస్యలు పరిష్కారం కాలేదని అక్కడికి వచ్చిన ప్రజలు సచివాలయం దగ్గర కూర్చొని పడి కాపులు కాస్తు ఉండిపోయారు. ప్రజలు సచివాలయం అధికారులను వివరణ కోరగా గ్రామాలలో సర్వే కి వెళ్ళింటిమని తడబడుతూ సమాధానం ఇచ్చారని వారు తెలిపారని వారు తెలిపారు. అలాగే డిప్యూటీ ఎంపీడీవో వివరణ కోరగా తమ దృష్టికి రాలేదని విచారణ చేస్తామని ఆయన తెలిపారు. సచివాలయం ఉద్యోగస్తులు సమయాపాలన పాటించి మా ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించాల అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

