డ్రైవర్ అప్రమత్తం..బయటపడ్డ విద్యార్థులు
1 min read

-విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం
పల్లెవెలుగు మిడుతూరు (నందికొట్కూరు):ప్రైవేట్ పాఠశాల బస్సు అదుపు తప్పడంతో విద్యార్థులు పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ప్రైవేట్ పాఠశాల బస్సు శుక్రవారం ఉ 8 గంటల సమయంలో సుంకేసుల గ్రామంలో విద్యార్థులను ఎక్కించుకొని పాఠశాలకు వస్తూ ఉండగా సుంకేసుల బాట మలుపు(నందికొట్కూరు- నంద్యాల ప్రధాన రహదారి) దగ్గర బస్సు స్టేరింగ్ ఊడిపోవడంతో పొలంలోకి బస్సు దిగడంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ప్రమాదం నుండి తప్పించడంతో విద్యార్థులు క్షేమంగా బయటపడాలని పాఠశాల కరస్పాండెంట్ తెలిపారు.సంఘటన స్థలానికిఎస్ఐ ఓబులేష్ మరియు పాఠశాల కరస్పాండెంట్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదని వారు తెలిపారు.

