పదవి వీరమణ పొందిన 9 మంది పోలీసులను సన్మానించిన జిల్లా ఎస్పీ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: పదవి వీరమణ పొందిన 9 మంది పోలీసులను సన్మానించిన జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ .సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేసి పోలీసు సిబ్బంది పదవి వీరమణ పొందడం అభినందనీయమని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు.ఈ సంధర్బంగా సోమవారం పదవి వీరమణ పొందిన
1) డిపిఓ సూపరింటెండ్ – ఎస్ . బాగ్య లక్ష్మీ
2) పత్తి కొండ ఎస్సై – ఎస్.టి. జమీర్
3) ఆదోని పిసిఆర్ ఎస్సై – బి. శ్రీరాములు
4) డిటిసి కర్నూలు ఎస్సై – సి. వెంకట రమణ
5) ఎఆర్ ఎస్సై – బి. శ్రీనివాసులు
6) ఎఆర్ ఎస్సై – ఎమ్. బందే నవాజ్
7) కర్నూలు పిసిఆర్ ఎఎస్సై – పి.ఆర్ . సులోచన రాణి
8) ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ వి. గోవిందరాజులు
9) ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ డి. హుస్సేనయ్య లను జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లా ఎస్పీ శాలువ, పూలమాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.కుటుంబాలతో సంతోషంగా గడపాలని, పదవివీరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా జిల్లా ఎస్పీ ని సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్, ఏ ఆర్ డిఎస్పీ భాస్కర్ రావు , స్పెషల్ బ్రాంచ్ సిఐ లు కేశవ రెడ్డి, తేజ మూర్తి, ఆర్ ఐ లు జావేద్ , నారాయణ, సోమశేఖర్ నాయక్ , జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు పాల్గొన్నారు.


