NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థినులకు ఎస్ఐ వ్యక్తిగత భద్రత, చట్టాలపై అవగాహన

1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్  నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ యొక్క ఆదేశాలపై పెదవేగి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్. రాజశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం పెదపాడు మండలం అప్పన్న వీడు పాఠశాల లో విద్యార్థినుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పెదపాడు ఎస్‌ఐ ఆర్ శ్రీనివాస్ పాల్గొని, మహిళలపై నేరాల నివారణ, POCSO చట్టం ప్రాముఖ్యత, శక్తి యాప్ వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల తక్షణ స్పందన,112 అత్యవసర సేవలు, సైబర్ భద్రత, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు.అనంతరం విద్యార్థినులతో పరస్పర చర్చ నిర్వహించి, వారు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చి, వ్యక్తిగత భద్రత, చట్టాలపై అవగాహన, అప్రమత్తత, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం, ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులను వెంటనే సంప్రదించాలని సూచించారు.మహిళలు, బాలికల భద్రతపై అవగాహన పెంపొందించడం, చట్టాలపై సరైన అవగాహన కల్పించడం,నేరాల నివారణలో విద్యార్థులను భాగస్వాములను చేయడం వంటి లక్ష్యాలతో ఏలూరు జిల్లా పోలీసులు ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు పెదపాడు ఎస్‌ఐ ఆర్ శ్రీనివాస్ తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *