హరిశ్ఛంద్ర శరీన్ నగర్ లో ఘనంగా సీతా నవమి
1 min read

విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి ఆధ్వర్యంలో…
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా శ్రీ అభయాంజనేయ స్వామి ప్రఖంఢ, శ్రీ సద్గురు త్యాగరాజ సీతారామాలయం, హరిశ్చంద్ర శరీన్ నగర్ లో సా. 7:00 గం.లకు అంగరంగ రంగు వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన మాతృశక్తి రాష్ట్ర కో – కన్వీనర్ శ్రీమతి జంపాల రాధిక మాట్లాడుతూ…శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి మహాపతివ్రత,”జనకుడి కుమార్తెగా, శ్రీరామచంద్రుడి భార్యగా, మహాసాధ్వీ సీతమ్మ తల్లిగా… మనందరికీ తెలిసు.కానీ సీత మహాశక్తి స్వరూపిణి. జనకుడికి నాగలి చాలులో దొరక్కముందు, రామచంద్రుణ్ణి వివాహమాడకముందు కూడా ఆ శక్తి ఉంది”. సీతమ్మ పేరుతో ‘సీతోపనిషత్తు’ అని అధర్వణ వేదంలో ఓ ఉపనిషత్తే ఉంది. అందులో ఆమె సిసలైన స్వరూప స్వభావాలు మనకు కనిపిస్తాయి, ఆమె ఎవరో స్పష్టమవుతుంది.., బ్రహ్మదేవుడు తన దగ్గరకు వచ్చిన దేవతలకు వివరించిన విషయాలు ఉపనిషత్తుగా మారాయి. అది సీతాదేవి మహత్వాన్ని వివరిస్తోంది”. సీతాదేవి అసామాన్యురాలు. ఆమె మూలప్రకృతి. ఒక్కమాటలో చెప్పాలంటే ‘ప్రకృతి అంటే సీతాదేవే’.అని ప్రణవనాదమైన ఓంకారంలో ఉన్నదీ ఆ తల్లే. సీత సత్వరజస్తమో గుణాత్మకమైనది. ఆమె మాయా స్వరూపిణి. సకార, ఇకార, తకారాల సంగమం సీత. స కారం ఆత్మతత్త్వానికి సంకేతం. త కారాన్ని తారా అని అంటారు. తరింపజేసేది అని దీనికి అర్ధం.అనిసీతాదేవి మహాత్మ్యం గురించి వివరించారు.మరో వక్త శ్రీమతి మాళిగి పావని మాట్లాడుతూ…సీతాదేవిని చూచి మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని ఆమె “భర్త” అడుగుజాడల్లో అంటే ధర్మానికి ప్రతీకైన రాముడికి భార్యగా నడిచిందని, అడవిలో శ్రీ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో లవకుకశులను కని ను పెంచి పెద్ద చేసి, సర్వగుణ సంపన్నులుగా తీర్చి దిద్దిందని వారికి రామభక్తిని బోధించి కుటుంబ గౌరవాన్ని కాపాడిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రఖండ మాతృ శక్తి సంయోజక లావణ్య, లక్ష్మీదేవి, ఉమాదేవి, సంధ్యారాణి, వెంకటేశ్వరమ్మ, పుష్ప, మహాలక్ష్మి, నాగమణి, లక్ష్మి, అశ్విని, అనురాధ,ఉషా, అంజలి, లావణ్య, పరిమళ, హారిక తదితరులు పాల్గొన్నారు.

