పరిశ్రమల స్ధాపన వల్లనే ఆర్ధిక ప్రగతి సాధ్యం
1 min read

ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సహకాలు, రాయితీలపై విస్త్రృత అవగాహన కల్పించాలి
ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఇ పార్కుల ఏర్పాటు పురోగతి సాధించాలి
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కల్పిస్తున్న అనేక ప్రోత్సహకాలు, రాయితీలపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల్లో విస్త్రృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు.మంగళవారం సాయంత్రం స్ధానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. సమావేశంలో అజెండా అంశాలు, పెండింగ్ ధరఖాస్తుల పురోగతి, ఎంఎస్ఎంఇ పార్కుల ఏర్పాటు అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకాలు అందిస్తోందని, కల్పిస్తున్న సౌకర్యాలు, రాయితీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి 15 రోజులకొకసారి డిఐపిసి సమావేశమై పరిశ్రమలకు సంబంధించిన అన్ని అనుమతులను సింగిల్ విండో పద్దతిలో తక్షణమే మంజూరు చేయడంతోపాటు ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ రాయితీలను మంజూరుచేయడం జరుగుతున్నదన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఇ పార్కుల ఏర్పాటుకు సంబంధిత నియోజకవర్గ ప్రత్యేక అధికారులు చొరవతీసుకోవాలన్నారు. ఇప్పటికే చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి ఎంఎస్ఎంఇ పార్కును ఏర్పాటుచేసుకోవడం జరిగిందన్నారు. ఏలూరు జిల్లాకు ప్రతిష్టాత్మకమైన కార్పెట్ రంగాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాటు చేసే క్లస్టర్ పనులను వేగవంతం చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్ పూర్తయినందున విద్యుత్, కాలుష్యనియంత్రణ మండలి తదితర శాఖల తరపున చేయవల్సిన పనులను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు.
జిల్లాలో 161 పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా అనుమతులు: జిల్లాలో పరిశ్రమల స్ధాపనకు ధరఖాస్తు చేసుకున్న 182 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సంబంధించి 161 ధరఖాస్తులకు సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేశామన్నారు. ఒక ధరఖాస్తు తిరస్కరించగా నిర్ధిష్టకాలపరిమిత లోపు మరో 20 ధరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నాయని, వాటిలో నిబంధనలమేరకు ఉన్న ధరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 7 పరిశ్రమల యూనిట్లకు వడ్డీ, సేల్స్ ట్యాక్స్ రాయితీలకింద రూ.35.06 లక్షలు రాయితీలుగా అందించేందుకు ఆమోదం తెలిపారన్నారు. అదే విధంగా 2 పరిశ్రమలకు పెట్టుబడి రాయితీ కింద రూ.89.33 లక్షలు అందించేందుకు ఆమోదం తెలపడం జరిగిందన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, జిల్లా పరిశ్రమల కేందం అధికారి సుబ్రహమణ్యేశ్వరరావు, పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్ధ జోనల్ మేనేజరు కె. బాజ్జి, లీడ్ బ్యాంక్ మేనేజరు డి. నీలాధ్రి, స్కిల్ డెవలప్ మెంట్ అదికారి ఎన్. జితేంధ్ర, ఎఫ్ఎస్ఎంఇ స్టేట్ కన్వీనర్ వేణుగోపాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నరు.


