NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

1 min read

జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో అధికారులకు దిశా,నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : జాతీయ రహదారిపై నివారించదగినది మరియు నివారించలేని వాహన ప్రమాదాలకు ఆస్కారంవున్న ప్రాంతాలను గుర్తించి నివేదిక సమర్పించాలని ఆర్ అండ్ బి , పోలీస్, నేషనల్ హైవే, రవాణా శాఖాధికారులతో కూడిన సబ్ కమిటీని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో మంగళవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ  నివారించదగిన రోడ్డు ప్రమాదాలపై దృష్టిసారించి అందుకు అవసమైన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భధ్రతా చర్యలను ముమ్మరం చేయడంతోపాటు భధ్రతా ప్రమాణాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లాలోని కలపర్రు నుంచి గుండుగొలను వరకుగల జాతీయ రహదారిపై అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన దాబా , హోటల్స్,ఇతర శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలు రోడ్డు భధ్రతా మరియు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించాలని ఏలూరు ఆర్డిఓను కలెక్టర్ ఆదేశించారు.  సంబంధిత యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి వివరాలు సేకరించడంతోపాటు హైవే ప్రక్కనవున్న దాబా, హోటల్స్ వద్ద ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారిలో ప్రమాదాలకు ఆస్కారంవున్న 30 బ్లాక్ స్పాట్స్ లో తీసుకున్న చర్యలపై సమావేశంలో సమీక్షించారు. వీటిలో 6 బ్లాక్ స్పాట్స్ లో తీసుకోవల్సిన చర్యలను 10 రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు పైలేట్ ప్రాజెక్ట్ కింద 5 ప్రాంతాల్లో సిసి కెమేరాల ఏర్పాటుకు ప్రతిపాధనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.జాతీయ రహదారి డివైడర్లపై మొక్కలు, ల్యాడ్ స్కేపింగ్ కు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారి మార్గంలో రోడ్డు వెంబడి గార్బేజ్ డంపింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశాలు ప్రతీ నెల నిర్వహిస్తున్నామని, సమావేశంలో జిల్లాలో ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలు చర్చిండంతోపాటు, ప్రమాద ప్రభావిత ప్రాంతాలలో  రహదారులు,భవనాలు, రవాణా, జాతీయ రహదారుల సంస్థల అధికారుల జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎన్. సూర్యచంద్రరావు, ఆర్ అండ్ బి ఎస్ ఈ రాజారత్నం, రవాణా శాఖ ఉప కమీషనర్ కరీం, ఏలూరు ఆర్డిఓ ఎం. అత్యుత అంబరీష్, ఆర్టీవో కృష్ణారావు,జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నాo,డిఇఓ ఎం. వెంకట లక్ష్మమ్మ, డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్ కుమార్, ఎన్.టి.ఆర్. ఆరోగ్యశ్రీ జిల్లా కోఅర్డినేటర్ డా. రాజీవ్, ఆర్ఐఓ యోహాన్,  జాతీయ రహదారుల సంస్థ అధికారులు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author