ఎంఈఓ ని సస్పెండ్ చేయాలి…
1 min read

మంత్రాలయం మండల విద్యాశాఖ అధికారి పై జిల్లా విద్యాశాఖ అధికారులకు ఎందుకింత ప్రేమ
గేదె కీ వినతి పత్రాన్ని అందజేసినటువంటి విద్యార్థి సంఘం నాయకులు
ఎమ్మిగనూరు ,న్యూస్ నేడు: ఈ సందర్భంగా ఆర్ ఏ వి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ జిల్లా కార్యదర్శి కాజా ఆర్ యు ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘునాథ్ ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ మంత్రాలయం మండలం లో ఉన్నటువంటి ప్రైవేటు స్కూల్స్ అయినా స్లేట్, జీనియస్ గ్లోబల్ పాఠశాలకు వత్తాసు పలుకుతున్న ఎంఈఓ ని సస్పెండ్ చేయాలని గత కొన్ని వారాల క్రితం ప్రభుత్వ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయగా అధికారులు సానుకూలంగా స్పందించి ఎంఈఓ పైన విచారణకు డిప్యూటీ డిఇఓ వెంకట్రామిరెడ్డి రావడం జరిగింది. విచారణ జరిగి వారాలు గడుస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఈయన పైన ఎందుకింత ప్రేమ అని ఆయన అధికార దుర్వినియోగం చేస్తున్న కూడా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ కి తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం సరికాదు అని,పాఠశాలలకు మౌలిక వసతులు లేకపోయినా అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల దెగ్గర నుంచి స్కూల్ యాజమాన్యం వేలల్లో ఫీజులు వసూలు చేస్తూనా దీనికి ఆధానంగా బుక్స్ ఫీజు అని యూనిఫామ్ ఇతర ఫీజులతో కలిపి విద్యార్థుల తల్లిదండ్రుల నెత్తిమీద వేస్తున్న కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు అయితే నేమి మండల విద్యాశాఖ అధికారులు అయితే నేమి నోరు మెదపకపోవడం అంటే బాధాకరమని వారు అన్నారు కావున ఇకనైనా పై విద్యాశాఖ అధికారులు స్పందించి మంత్రాలయం ఎంఈఓ పైన ప్రేమను వీడి ఆయనను సస్పెండ్ చేసి పేద విద్యార్థుల అయినటువంటి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఈ సమస్య పైన మరిన్ని ఉద్యమాలకు పూనుకుంటామని వారు హెచ్చరించారు.

