NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆలూరు ప్రజల సంక్షేమం కోసం శ్రీశైలంలో ప్రత్యేక పూజలు

1 min read

ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి, మాజీ ఇంచార్జ్ వైకుంఠం శివప్రసాద్

ఆలూరు న్యూస్ నేడు: పవిత్ర పుణ్యక్షేత్రమైన లో శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారిని ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్  వైకుంఠం జ్యోతి, మాజీ ఇంచార్జ్ వైకుంఠం శివప్రసాద్ భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యసంపదలతో జీవించాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని, యువతకు ఉపాధి అవకాశాలు లభించాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని వారు శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారిని ప్రార్థించారు.అదేవిధంగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, ప్రజల సంక్షేమం మరింత బలోపేతం కావాలని, ఆంధ్రప్రదేశ్ శాంతి, సుభిక్షాలతో ముందుకు సాగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ దర్శనం సందర్భంగా ఆలయ అర్చకులు వైకుంఠం జ్యోతి, వైకుంఠం శివప్రసాద్ దంపతులకు వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

About Author