NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హెల్త్​ యూనివర్శిటీలో నూతన సంస్కరణలకు శ్రీకారం..

1 min read

త్వరలో  ఇన్ఫెక్షన్​ డిసీజ్​ పై కోర్సు ప్రారంభిస్తాం..

  • భావి వైద్యుల కోసమే… వైద్యరంగంలో రీసెర్చ్​..
  • యాంటిబయాటిక్స్​ వాడకం మితంగా ఉండాలి
  • ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్​ ఛాన్సలర్​ డా. పి చంద్రశేఖర్
  • కర్నూలు మెడికల్​ కాలేజిలో ఇన్ఫెక్షన్​ డిసీజ్​పై అవగాహన సదస్సు

కర్నూలు హాస్పిటల్​ , న్యూస్​ నేడు : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇన్ఫెక్షయస్ డిసీజెస్ పై  రెండు సంవత్సరాల పోస్ట్ డాక్టర్స్ ఫెలోషిప్ ( పిడిఎఫ్​ ) కోర్సును త్వరలో ప్రారంభిస్తామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పులాల చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం కర్నూల్ నగరంలోని మెడికల్ కాలేజీ యందు క్లినికల్ ఇన్ఫెక్షయస్ డిసీజెస్ సొసైటీ సిఐడిఎస్ ఏపీ చాప్టర్ & కేఎంసి జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ లు  సంయుక్తంగా ఇన్ఫెక్షయస్ డిసీజెస్ పై  సదస్సు నిర్వహించారు.  ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న వైస్ ఛాన్స్ లర్  డా. చంద్ర శేఖర్​ మాట్లాడుతూ సమాజంలో  యాంటీ బయాటిక్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోతుందని, ఇది సమాజానికి ప్రమాదకరమన్నారు. వైద్యుల సలహా లేకుండా ఎట్టి పరిస్థితుల్లో యాంటీబయాటిక్స్ వాడకూడదని తెలిపారు. హెల్త్ యూనివర్సిటీ రీసెర్చ్ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ఇందు కొరకు ప్రత్యేకంగా 50 లక్షల రూపాయలు కేటాయించామని తెలిపారు.

భావి వైద్యుల కోసమే… రీసెర్చ్​..

హెల్త్​ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జనవరి 12న రీసెర్చ్ డే నిర్వహించడం జరిగిందన్నారు. వైద్యరంగంలో ఎంత ఎక్కువ రీసెర్చ్ జరిగితే అది భావి వైద్యులకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. మెరుగైన వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చి  రోగులకు కూడా  ఉపయోగపడతాయన్నారు. రాష్ట్ర గవర్నర్ , ముఖ్యమంత్రి , హెల్త్ మినిస్టర్, సెక్రటరీ  అందరూ ఆరోగ్యం రంగం సంబంధించి మంచి చేయూత నిస్తున్నారని ఆయా మెడికల్ కాలేజీ నుండి చదివి వెళ్ళిన ప్రముఖ వైద్యులతో అల్యూమిని సమావేశాలు నిర్వహించాలని P4 విధానం లో మెడికల్ కాలేజీ, వైద్యశాలల అభివృద్ధికి సహకరించేలా ప్రణాళిక రూపొందించారన్నారు. ఇందుకు గాను పది లక్షల రూపాయలని అందిస్తోందన్నారు..

 ప్లే గ్రౌండ్​ అభివృద్ధికి.. రూ.10 లక్షలు

ప్రతి మెడికల్ కాలేజీకి వైద్య విద్యార్థుల ఆటలకు సంబంధించి ప్లే గ్రౌండ్ సంబంధించి అభివృద్ధికి పది లక్షల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. ఈ సదస్సులో వివిధ అంశాలపై  ఇటీవల వచ్చిన నూతన ఆవిష్కరణలు కీలక అంశాల గురించి వివిధ కళాశాల వైద్యులు ప్రజెంటేషన్ లు చేశారు.  కార్యక్రమంలో ఏడిఎంఈలు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ​ డాక్టర్ చిట్టి నరసమ్మ,  జిజిహెచ్​ సూపరిటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు , క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రకాష్, ఆర్గనైజింగ్ చైర్మన్ హెచ్ ఓ డి జనరల్ మెడిసిన్ డాక్టర్ శ్రీరాములు, సిఐడిఎస్ ఏపీ చాప్టర్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ లు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డా. వీరెన్ గంటా,డా. నీరెన్ రవెలా, ఏపీఎంసీ అబ్జర్వర్ డాక్టర్ రాజేష్, ప్రముఖ వైద్యులు డాక్టర్ కృష్ణమోహన్, డా. భవానీ ప్రసాద్, డా. సుధాకర్, వైస్ ప్రిన్సిపల్ డా. సాయి సుధీర్, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్లు డాక్టర్ లక్ష్మి డాక్టర్ రవి కళాధర్ రెడ్డి, దామం శ్రీనివాసులు, డా.సోమప్ప, డా. విద్యాసాగర్  మరియు వివిధ వైద్య కళాశాల నుంచి వచ్చిన జనరల్ మెడిసిన్ వైద్యులు పాల్గొన్నారు.

About Author