NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మానవ శరిరానికి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఏంతో దోహదపడతాయి

1 min read

జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

గెలుపే లక్ష్యంగా ఆడే క్రీడల్లో పొందే స్ఫూర్తి మరెక్కడా దొరకదు

ఏలూరుజిల్లా ప్రతినిది,న్యూస్ నేడు: మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. గెలుపే లక్ష్యంగా ఆడే క్రీడల్లో పొందే స్ఫూర్తి మరెక్కడా దొరకని సరైన దృక్పథమని ఆయన వ్యాఖ్యానించారు. ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో 10వ ఏపి ఇంటర్‌-డిస్ట్రిక్ట్ మోడరన్ పెంటాథ్లాన్ లేజర్‌ రన్‌ ఛాంపియన్‌ షిప్‌ – 2026 క్రీడా పోటీలు శనివారం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, శాప్‌ డైరెక్టర్‌ కొవ్వాసు జగదీశ్వరి ముఖ్య అతిధులుగా పాల్గొని, క్రీడాపోటీలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరులో క్రీడాకారులకు అన్ని వసతులతో కూడిన క్రీడా మైదానాలు ఉండడం ఎంతో సంతోషదాయకమని వ్యాఖ్యానించారు. అలాగే ఏఎస్‌ఆర్‌ స్టేడియంలో రన్నింగ్‌ ట్రాక్‌ నిర్మాణానికి తనవంతు ప్రయత్నం చేస్తానని ఆయన క్రీడాకారుల కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. అలాగే ఒలింపిక్స్‌ క్రీడల్లో కేవలం పాల్గొనడమే కాకుండా అందులో విజేతలుగా నిలిచి క్రీడారంగంలో ఏలూరు ఖ్యాతిని మరింత ఇనుమడింపచేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి ఆకాంక్షించారు. శాప్‌ డైరెక్టర్‌ కొవ్వాసు జగదీశ్వరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడాకారులను అన్నివిధాలా ప్రోత్సహిస్తోందన్నారు. ఈ నెల 15వ తేదీ నుండి నిర్వహించే అమరావతి ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో కూడా క్రీడాకారులు పెద్దసంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఆమె సూచించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటిని, డైరెక్టర్‌ జగదీశ్వరిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డిఎస్‌డివో ఎస్‌ఎ అజీజ్‌, ఏపి మోడరన్ పెంటాథ్లాన్ ఛైర్మన్‌ సిహెచ్‌ వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్‌ కె. హరిబాబు, రిటైర్డ్‌ హెచ్‌ఎం జల్లా వీరభద్రరరావు, చింతకాయల సత్యనారాయణ, కె.కృష్ణ, పి.షణ్ముగం, డి. కోటేశ్వరరావు, మరడాని అచ్యుతరావు,బౌరోతు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *