పొట్లపాడు వంతెన నిర్మాణం మొదలు పెట్టండి
1 min read

పొట్లపాడు వంతెన నిర్మాణం మండలం అభివృద్ధికి నాంది
అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ
అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ కర్నూలు
కర్నూలు, న్యూస్ నేడు: పొట్లపాడు వంతెన నిర్మాణం మండలం అభివృద్ధికి నాంది అని దేవనకొండ మండలంలోని పోట్లపాడు వద్ద 200 మీటర్ల వంతెన నిర్మాణం అత్యవసరం అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అడ్వొకేట్ క్రాంతి నాయుడు బోయ గారు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు మరియు దేవనకొండ మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి వంతెన నిర్మాణ ప్రతిపాదన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా క్రాంతి నాయుడు మాట్లాడుతూ ఈ వంతెన నిర్మాణం ద్వారా దేవనకొండ క్రాస్ నుండి ఎమ్మిగనూరు వరకు కుంకనూరు, పోట్లపాడు, బన్నూరు, బైలుప్పల, అగ్రహారం క్రాస్ మార్గంగా 50కు పైగా గ్రామాలకు మెరుగైన అనుసంధానం కలుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రజలు చాలా పొడవైన మార్గాన్ని ఉపయోగించాల్సి వస్తోందని, ఈ వంతెన నిర్మాణంతో సుమారు 50 కిలోమీటర్ల దూరం తగ్గి సమయం, ఇంధనం మరియు రవాణా ఖర్చులు తగ్గుతాయని చెప్పారు.ఈ వంతెన నిర్మాణం ప్రాంత ప్రజల దీర్ఘకాలిక అవసరమని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ కోరింది, అలానే స్థానిక ఎమ్మార్వో కు కమిటీ సభ్యులు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఏ సూర్య ప్రకాష్ రెడ్డి, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ డివి సాంబశివుడు, కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ కె రాఘవేంద్ర రెడ్డి, మరియు మండల నాయకులు డాక్టర్ వెంకప్ప, షేక్షావలి, శ్రీనివాసులు, రంగస్వామి, కాసిం, శ్రీ శంకరయ్య, రామస్వామి, పరమేష్, బందే నవాజ్, టైలర్, వెంకీ తదితరులు పాల్గొన్నారు.

