NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాల్వబుగ్గ ఆలయంలో చోరీ కేసులో మహరాష్ట్రకు చెందిన  ఇద్దరు నిందితులు అరెస్ట్

1 min read

కర్నూలు  జిల్లా పోలీసు కార్యాలయంలో  మీడియాకు  వివరాలు వెల్లడించిన … కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్

నిందితుల నుండి 4 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నాం.

రెక్కి చేసి మొత్తం 5 మంది నేరానికి పాల్పడ్డారు ….   మొత్తం 10 కిలోల వెండి దొంగలించారు. వీరి పై ఐడి అరాక్ కేసులు ఉన్నాయి.

మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశాం.  మిగిలిన ముగ్గుర్ని త్వరలో అరెస్టు చేస్తాం.  మిగిలిన  ప్రాపర్టి ని  రికవరీ చేస్తాం. 

టోల్ గేట్ లలోని  సిసి టివి పుటేజిల టెక్నాలజీ ఆధారంగా ఈ  కేసు ను చేధించాం.

ఓర్వకల్లు, న్యూస్​ నేడు: ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ Cr.No: 46/2026, సెక్షన్ 331(4), 305(d) BNS కేసులో శ్రీ బ్రమరాంబ బుగ్గ రామేశ్వర స్వామి దేవాలయం, కాల్వబుగ్గ యందు 16/17.03.2026 వ తేదీ నాడు గుర్తు తెలియని దొంగలు దొంగతనానికి పాల్పడినారు. దొంగలను పట్టుకోవడానికి, కర్నూలు జిల్లా ఎస్పీ  శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారి ఆదేశాల మేరకు  కర్నూలు డి.యస్.పి. జె.బాబు ప్రసాద్ గారి ఆద్వర్యంలో కర్నూలు రూరల్ సర్కల్ సి.ఐ. యం.చంద్రబాబు నాయుడు, ఓర్వకల్లు పి‌ఎస్ యస్.ఐ. U.సునిల్ కుమార్, ఉలిందకొండ పి‌ఎస్ యస్.ఐ ఎ.ధనుంజయ, కె.నాగలపురం పి‌ఎస్ యస్.ఐ. A.అఖిల్ లతో స్పెషల్ టీమ్ లు ఏర్పాటు చేశారు.

దొంగతనానికి సంబంధించి ఇద్దరు నిందితులు

1)  అర్జున్ పూనం కుంబ్హర్ (పుణె, మహారాష్ట్ర)

2)  అక్షయ్ జైసింగ్ ఠాకూర్ (చించ్వడ్, మహారాష్ట్ర) లను 05.04.2026 వ తేదీ సాయంత్రం 6.15 గంటలకు అరెస్టు చేయడం జరిగినది నిందితులు తమ సహచరులు జెర్నల్, అమిత్, బజరంగి లతో కలిసి ఈ నేరము చేసినట్లు అలాగే నెల్లూరు జిల్లా, దుత్తలూరు పోలీసు స్టేషన్ పరిధిలో నర్రవాడ ఎల్లమ్మ గుడిలో దొంగతనం మరియు ఇతర దొంగతనాలు ఇంకా ఏమైనా చేసినారా అని విచారణ చేస్తున్నారు.

స్వాధీనం చేసుకున్న   చోరీ కాబడిన వస్తువులు:  వెండి నాగాభరణం ముక్కలు, వెండి సింహం విగ్రహ ముక్కలు, అమ్మవారి పీటం ముక్క, ధారా పాత్ర,

దొంగతనానికి ఉపయోగించిన పరికరాలు: పెద్ద బోల్ట్ కట్టర్, స్క్రూ డ్రైవర్లు, గ్లౌజులు, నిందితుల వాహనం: Maruti Suzuki Wagon R

MH14JR4662, నిందితుల మొబైల్ ఫోన్లు (OnePlus, VIVO T2X5G)

విచారణలో ముఖ్యాంశాలు:

నిందితులు ఆలయాల పరిసర ప్రాంతాలను గూగుల్ మ్యాప్ ద్వారా గుర్తించి, రాత్రి సమయంలో తాళాలు కట్ చేసి దొంగతనాలు చేశారు.

CCTV ఫుటేజ్ మరియు ఇతర సాంకేతిక  సాక్ష్యాదారాలతో నిందితుల ప్రమేయం నిర్ధారించబడింది.

తదుపరి చర్యలు:మిగిలిన నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి.ఈ కేసు ను త్వరత గతిన ఛేదించిన కర్నూల్ DSP శ్రీ బాబు ప్రసాద్ గారిని , కర్నూల్ రూరల్ CI M.చంద్రబాబు నాయుడు, ఓర్వకల్లు, ఉలిందకొండ, కె.నాగలపురం, కర్నూలు తాలూకా ఎస్.ఐ. లు  U.సునిల్ కుమార్, A.ధనుంజయ, A.అఖిల్, P.మోహన్ కిషోర్ రెడ్డి, మరియు సిబ్బంది HC జి.ప్రతాప్ కుమార్, ఆర్.సుబ్బరాయుడు, PCs S.సమీర్, కిరణ్, మద్దిలేటి, రవీంద్ర సింగ్, వెంకటరమణ, సోమేష్ లను   కర్నూలు ఎస్పీ   అభినందించినారు.  పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ  రివార్డులు అందజేశారు. ప్రజలకు విజ్ఞప్తి: ఆలయాలలో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగలరు.

About Author