రహదారి భద్రతపై గోడపత్రిక ఆవిష్కరించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి
1 min read

పాల్గొన్న రవాణా అధికారులు, ఆర్టీవోలు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది
కాకినాడ, న్యూస్ నేడు: కాకినాడలోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో “రహదారి భద్రత – ఒక సామాజిక బాధ్యత” అనే గోడపత్రికను రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారులు, ఆర్టీవోలు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ గోడపత్రిక ముఖ్యపాత్ర పోషిస్తుందని మంత్రి తెలిపారు.

