NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘సూపర్‌ సిక్స్‌’తో ప్రతి ఇంట్లో సంతోషాలు…

1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కల్లూరు మండలం కొంగనపాడు గ్రామం మరియు చెట్లమల్లాపురం గ్రామాలలో  “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా,గ్రామాలలో పర్యటించి ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన సంవత్సర కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించిన పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి  మరియు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ ఈ సందర్బంగా  ఎమ్మెల్యే చరిత రెడ్డి మాట్లాడుతు .వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలన చేసి, అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేశారు,‘సూపర్‌ సిక్స్‌’తో ప్రతి ఇంట్లో సంతోషాలు. సుపరిపాలనతో రాష్ట్ర ప్రజలు సురక్షితం,పేదరికం లేని ఇల్లు చూడాలని ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడు  నిరంతరం కృషి చేస్తున్నారు,ప్రజలకి ఇచ్చిన మాట కోసం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నమని తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షుడు, రాష్ట ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు, ఏపీ టూరిజం డైరెక్టర్ ముంతాజ్ బేగం,గ్రామ నాయకులు వినోద్,మాజీ సర్పంచ్ నాగయ్య,చెట్లమల్లాపురం గ్రామ నాయకులు తిమ్మారెడ్డి, ఉపరి శివ,దామోదర్ రెడ్డి,ఉలిందకొండ సొసైటీ చైర్మన్ ఇవి రమణ,మండల నాయకులు కురువ ధనుoజయ, సాయి తరుణ్ రెడ్డి,దేవేందర్ రెడ్డి,కరీం,మరియు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author