హైవే అధికారుల వింత పోకడలు- దుకాణదారులకు అవస్థలు
1 min read
చెన్నూరు, న్యూస్ నేడు: కడప కర్నూల్ హైవే రహదారి విస్తరణలో భాగంగా చెన్నూరు కొత్త రోడ్డుపై ఇరువైపులా రోడ్డు విస్తరణ పేరుతో స్థలం తీసుకున్న హైవే అధికారులు వింత పోకడలకు వారు చేసే పనులకు దుకాణం దారులు పలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. గత 12 సంవత్సరాల క్రితం ఒక సెంటు స్థలం 17 వేల రూపాయలు చెల్లించి రోడ్డు విస్తరణ పేరుతో చాలామంది పేద ప్రజలను రోడ్డున పడేశారు.దీంతోపాటు వారు తీసుకున్న స్థలం వరకు ఎటువంటి పనులు చేపట్టకపోవడంతో ఉన్న స్థలంలో పేద ప్రజలు దుకాణాలు ఏర్పాటు చేసుకొని బ్రతుకు బండి లాగిస్తున్నారు. అయితే ఆరు నెలలకు, సంవత్సరానికి ఓసారి హైవే అధికారులు ఏదో ఒక పని చేస్తామని చెప్పి దుకాణదారులను వేసుకున్న తాత్కాలిక షెడ్యూల్ ను తొలగించమని హెచ్చరికలు జారీ చేయడంతో చేసేది ఏమీ లేక వారు వాటిని తొలగిస్తున్నారు.కానీ హైవే అధికారులు మాత్రం మా స్థలం ఇంతవరకు ఉంది అనే నిర్ణయం దుకాణదాలకు చెప్పకపోవడం వారు యధామాములుగా తాత్కాలిక షెడ్లను వేసుకోవడం జరుగుతుంది. గత వారం రోజుల క్రితం పెన్నా నది నుంచి కొప్పర్తి వరకు పైపులైన్ ఏర్పాటు చేసేందుకు పనులు చేపడుతున్నామని చెప్పి మరోసారి దుకాణదారులను ఇబ్బంది పెట్టారు. అయితే వారు పైపులైనుకు కాలువలు తీసింది లేదుసరి కదా! దుకాణదారులను మరోసారి ఇబ్బంది పెట్టారు. దుకాణదారులు కేవలం చలువ పందిర్లు, ప్లాస్టిక్ పట్టలతో తాత్కాలికంగా కప్పుకొని అలాగే దుకాణాలను జరుపుకుంటున్నారు. హైవేఅధికారుల నిబంధనలు మేరకు పనులు ఎందుకు చేపట్టడం లేదు:- రోడ్డుకి ఇరువైపులా స్థలాలను సేకరించినప్పుడు అప్రోచ్ రోడ్లు, డ్రైనేజీలు ,బస్సు షెల్టర్లు నిర్మిస్తామని నిబంధనలతో హైవే రోడ్డు నిర్మించి నిర్మాణం చేపట్టారు. అయితే12 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ పనులు ఏవి చేసిన పాపాన పోలేదు. ఈ పనులను పూర్తి చేసి టోల్గేట్ జరుపుకోవాలని సాక్షాత్తు కమలాపురం ఎమ్మెల్యే చెప్పినాఆయన మాటలను కూడా హైవే అధికారులు పెడచెవిన పెట్టారు. ఇకబస్ షెల్టర్ నిర్మాణానికి వస్తే ఇప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎంత గగ్గోలు పెట్టినా కూడా వారి పని వారిదే తప్ప ఈ పనులకు శ్రీకారం చుట్టలేదు కదా కనీసం ఎమ్మెల్యే మాటకు కాసింత కదిలిన పాపాన పోలేదు. ఇంకెన్నాళ్లు ఈ అరాచకం అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .హైవే అధికారులు చేసే వింత పోకడలకు రోడ్డుకి ఇరువైపులా దుకాణదారులు పూర్తిస్థాయిలో నష్టపోవడమే ఆనవాయితీగా మారింది. ఇప్పటికైనా హైవే అధికారులు వారి స్థలం వరకు గట్టి చర్యలు చేపడితే ఈ దుకాణం దారులకు ఇబ్బందులు ఉండవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

