NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్రమంగా గో-రవాణా చేస్తే కఠిన చర్యలు

1 min read

రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై మణికంఠ..

నందికొట్కూరు న్యూస్ నేడు: ఎవరైనా సరే అక్రమంగా గో రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రమణ్యం మరియు బ్రాహ్మణకొట్కూరు  ఎస్సై వి మణికంఠ అన్నారు.బక్రీద్ పండుగ సమీపిస్తున్నందున జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు అంతర్ జిల్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు  పోలీస్ స్టేషన్ పరిధిలో కొల్లబావాపురం వద్ద సోమవారం అంతర్‌జిల్లా (ఇంటర్ డిస్ట్రిక్ట్) చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు ఎస్సై మణికంఠ తెలిపారు.చెక్ పోస్ట్ ను రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం పరిశీలించి ఎస్ఐకి మరియు సిబ్బందికి తగు సూచనలు సీఐ సూచించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పండుగ సీజన్‌లో కొందరు వ్యక్తులు చట్ట వ్యతిరేకంగా గోవులను తరలించే అవకాశం ఉన్నందున ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రజలకు ముఖ్యమైన సూచనలు: గో రవాణా చట్టరీత్యా నేరం బక్రీద్ సందర్భంగా ఎవరైనా వ్యక్తులు అక్రమంగా గోవులను తరలిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నిబంధనలు ఉల్లంఘించి గోవులను అక్రమ రవాణా చేసే వారికి చట్టరీత్యా శిక్షలు ఉంటాయనికోళ్లబావాపురం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ ద్వారా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు.అదేవిధంగా నందికొట్కూరు-ఆత్మకూరు నేషనల్ హైవే రోడ్ రబ్బానీ గోడౌన్ దగ్గర పట్టణ ఎస్ఐ చంద్రశేఖర్ మరియు సిబ్బంది చెక్ పోస్ట్ ద్వారా వాహనాలను తనిఖీ చేశారు.

About Author