NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి

1 min read

జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్

మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా చర్యలు

ఆపదలో ఉన్న వారిని మానవత్వంతో ఆదుకోవాలి

అడిషనల్ ఎస్పీ యోగేంద్ర బాబు

నంద్యాల, న్యూస్​ నేడు: వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యే గంజాయి, గుట్కా తదితర మత్తు పదార్థాలను నియంత్రించేందుకు పోలీసులతో పాటు రెవెన్యూ, వ్యవసాయ, ఉన్నత విద్యా, తదితర శాఖల అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మత్తు పదార్థాల నియంత్రణ అమలుపై సంబంధిత కమిటీ సభ్యులతో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ రామునాయక్ మాట్లాడుతూ….జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిదిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి గంజాయి ఇతర మత్తు పదార్థాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లలు మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు బానిస కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author