యోగాంధ్రలో ఇరిగేషన్ సర్కిల్ అధికారులు, ఇంజినీర్లు,ఉద్యోగులు
1 min read
యోగా దినోత్సవంలో తప్పనిసరిగా ప్రజలు.ఉద్యోగులు భాగస్వామ్యులు కావాలని
రాష్ట్ర ఇరిగేషన్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు,ఇరిగేషన్ డివిజన్ సూపరింటెండెంట్ చోడగిరి శ్రీనివాస్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: యోగాంధ్ర -2026 కార్యక్రమంలోభాగంగా ఏలూరు డిఆర్డిఎ, టిటిడిసి ప్రాంగణం వట్లూరులో జలవ నరుల శాఖ ఏలూరు ఇరిగేషన్ సర్కిల్, పోలవరం కుడి ప్రధాన కాల్వ సర్కిల్ ఇంజినీర్లు, ఉద్యోగులు యోగాంధ్ర కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజినీర్ చిలకపాటి దేవ ప్రకాష్ ఆధ్వర్యంలో పాల్గొని యోగా గురువు ప్రవీణ్ చెన్నారెడ్డి సూచనలతో యోగాస నాలు ప్రాణాయామం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు, ఇరిగేషన్ డివిజన్ సూపరింటెండెంట్ చోడగిరి శ్రీనివాస్.నీరు. ప్రగతి ఎస్ఇ టి.వెంకటస్వామి, ఎగ్జిక్యూ టివ్ ఇంజినీర్లు కె. జగదీ శ్వరరావు కలిగిత రాజు పుట్టా ధనుంజయ్ డీఈఈ లుపి.గనిరాజు. పి.సీతారాం. నాగమణి. జూనియర్ ఇంజినీర్లు..జలవనరుల శాఖ మంత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచ యోగా దినోత్సవం 2014వ సంవత్సరంలో ప్రారంభించారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం యోగా దినోత్సవం జరుపుతూ జిల్లా కలెక్టర్లు ద్వారా నిర్వహిస్తున్నారని, ఈ యోగా దినోత్సవంలో తప్పనిసరిగా ప్రజలు.ఉద్యోగులు భాగస్వామ్యులు కావాలని సూచించారు.

