సాయి గణపతి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ మహోత్సవాలు
1 min read

విజయవాడ, న్యూస్ నేడు: సాయి గణపతి మహోత్సవ కమిటీ ఆధ్వర్యం సత్యనారాయణపురం లో గణేశ చతుర్థి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ గత ఏడాదినుండి గణేష్ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం 2 వసారి కూడా గణేష్ మహోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా 27వ తేదీ నుండి 6వ తేదీ వరకు శ్రీ గణేష్ పూజ మహోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీన నాడు అన్నదాన కార్యక్రమం సుమారు 5000మందికి నిర్వహిస్తున్నామని ఆ తర్వాత రోజు 6వ తేదీన శ్రీ వినాయకుని లడ్డు వేలం పాట నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం శ్రీ వరసిద్ధి వినాయకుని మేళ తాళాలతో ఊరేగించి నిమజ్జన కార్యక్రమం కనుల పండువగా జరపనున్నట్లు వ్యక్తపరిచారు. శ్రీ గణేష్ పూజ మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని వినాయకుని ఆశీస్సులు పొందవలసిందిగా భక్తులకు పిలుపునిచ్చారు.శ్రీ గణేష్ మండపము ఏర్పాటుకు మహోత్సవములు నిర్వహించేందుకు పోలీస్ శాఖ వారు సింగిల్ విండోస్ పద్ధతి ప్రకారం ఆన్లైన్లో పర్మిషన్ ఇచ్చి తమకు ఎంతో సహకరించారని ఈ ఆన్లైన్ పద్ధతి వలన సింగిల్ విండో ద్వారా చాలా సులభంగా పర్మిషన్లు పోలీస్ శాఖ నుండి లభించాయని అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ నుండి కూడా అన్ని పర్మిషన లభించేందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి సాయి గణపతి మహోత్సవ కమిటీ సభ్యులు సింహాద్రి శివ మనిషాయి వర్మ వెంకీ తదితరులు పాల్గొన్నారు.


