జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేస్తున్నాం
1 min read

కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహం – అభివృద్ధి దిశగా జిల్లా
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసి, కొత్త పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు. పరిశ్రమల అభివృద్ధికి ఊతంగా మొత్తం రూ.1.88 కోట్లు ప్రోత్సాహకాలు మంజూరు చేయడంతో పాటు, సామాజిక న్యాయం దృష్ట్యా ఎస్సీ వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రూ. 2.88 కోట్లు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అందించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పరిశ్రమలు మరియు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ (DIEPC) సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకింగ్ ప్రతినిధులు మరియు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…జిల్లాలో పరిశ్రమల విస్తరణ, ఎగుమతుల పెంపు కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందించడం ద్వారా కొత్త పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఇది జిల్లాలో ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతుందని తెలిపారు. జిల్లా పరిశ్రమలు మరియు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ ద్వారా మొత్తం 21 క్లెయిమ్స్‌కు సంబంధించి కోటి 88 లక్షల 48 వేలు విలువైన
పరిశ్రమలకు ప్రోత్సాహకాలు.
జిల్లాలో ప్రోత్సాహకాలు మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ఇందులో భాగంగా…
6 కంపెనీలకు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కింద రూ. 28 లక్షల 85 వేలు
8 కంపెనీలకు ఇంట్రెస్ట్ సబ్సిడీ కింద రూ. 39 లక్షల 80 వేలు7 కంపెనీలకు సేల్స్ ట్యాక్స్ సబ్సిడీ కింద రూ. 1కోటి 88 లక్షల 43 వేలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.యువతను స్వయం ఉపాధి వైపు దారితీసే విధంగా “వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్” కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ప్రభుత్వ పథకాలు గ్రామ స్థాయికి సమర్థవంతంగా చేరేలా కృషి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.సమావేశంలో జిఎం ఇండస్ట్రీస్ అశోక్ కుమార్, జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంఘ అధ్యక్షులు విజయకుమార్ , రాజా మహేంద్ర నాథ్ , కర్నూల్ అడిషనల్ మున్సిపల్ కమిషనర్ ,కృష్ణ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి , పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్ రెడ్డి , జెడి వ్యవసాయ శాఖ వరలక్ష్మి , ఏపీఎంఐపి పిడి సుధాకర్ , ఎల్డీఎం రామచంద్రరావు , మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి, ఎస్సీ ట్రాన్స్కో మహేశ్వర్ రెడ్డి , డి సి ఎల్ వెంకటేశ్వర్లు, డిటిసి శాంతకుమారి , జడ్.ఎం మధుసూదన్ , పరిశ్రమల శాఖ డిడి లు జవహర్ బాబు, డేనియల్ , డిస్టిక్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ దీప్తి,మాధురి, డిడి గ్రౌండ్ వాటర్ సునీల్ కుమార్, ఫైర్ ఆఫీసర్ అవినాష్ జయసింహా , ఏ. డి. హార్టికల్చర్ రాజా కృష్ణా రెడ్డి , డి ఎస్ డబ్ల్యూ ఓ రాధిక తదితరులు పాల్గొన్నారు.


