NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నారా లోకేష్‌ను కలిసిన ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి

1 min read

ఆలూరు న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిననారా లోకేష్ ని ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ, నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతూ ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధికి, కార్యకర్తల సంక్షేమానికి లోకేష్  తీసుకునే నిర్ణయాలు మార్గదర్శకంగా ఉంటాయని పేర్కొన్నారు.అలాగే, ఆలూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని, లోకేష్  నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *