NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సుంకాలమ్మ, యెల్లమ్మ దేవి కుంభోత్సవం ఘనంగా నిర్వహణ

1 min read

భక్తి శ్రద్ధల నడుమ ఊరి దేవర కార్యక్రమం వైభవంగా… టిడిపి నాయకుల పాల్గొనిక

హోళగుంద న్యూస్ నేడు: మార్లమాడికి గ్రామంలో శ్రీ సుంకాలమ్మ దేవి, శ్రీ యెల్లమ్మ దేవి కుంభోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధల నడుమ అత్యంత ఘనంగా నిర్వహించబడింది. గ్రామ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఊరి దేవర కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా జరిగింది. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ పవిత్ర వేడుకను విజయవంతం చేశారు.ఈ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్ , మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పంపపతి , టిడిపి సీనియర్ నాయకులు యారిస్వామి , దిద్ది నాగప్ప , దీదీ మలయ్య, రామంజి, బగోడి రాము, సింధువలం మలి, తెలుగు యువత అధ్యక్షుడు వీరేష్ సూరన తదితరులు పాల్గొన్నారు.అతిథులు దేవాలయ కార్యక్రమాలను దర్శించుకుని దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మార్లమాడికి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.గ్రామానికి విచ్చేసిన టిడిపి నాయకులను గ్రామస్థులు హర్షాతిరేకాలతో స్వాగతించారు. ఈ సందర్భంగా ఈబీజీ గోవింద్ గౌడ్ ని పూలహారం, శాలువాతో ఘనంగా సన్మానించారు.

About Author