ఇంటర్మీడియట్ ఫలితాలలో శ్రీ విద్యాలయ జూనియర్ కాలేజ్ విజయభేరి
1 min read

విద్యార్థులను అభినందించిన కళాశాల డైరెక్టర్,ప్రిన్సిపాల్ యం. నాగార్జున
ఏలూరుజిల్లాప్రతినిధి,న్యూస్ నేడు: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలలో ఏలూరులోని శ్రీ విద్యాలయ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఘన విజయం సాధించి విజయభేరి మొగించారు. ఐపిఇ ఫలితాలలో శ్రీ విద్యాలయ జూనియర్ కాలేజ్ జూనియర్ ఎంపిసి ఎ.మౌనిక 453 /470, జూనియర్ బైపీసీ పి. రేష్మా 438 /455, జూనియర్ సిఇసి ఎ.మీనాక్షి 477/500, జూనియర్ ఎంఈసి 477/500 మార్కులు సాధించారని తెలిపారు. అలాగే జూనియర్ సిఈసి కామర్స్ సబ్జెక్టులో అరిగెల మీనాక్షి దేవి 100/100, జూనియర్ ఎంపీసీ ఫిజిక్స్ సబ్జెక్టులో రాగోలు జస్వంత్ శంకర్ 85/85, జూనియర్ ఎంపీసీ కెమిస్ట్రీ సబ్జెక్టులో అద్దేపల్లి మౌనిక 85/85, జూనియర్ బైపీసీ వృక్షశాస్త్రం సబ్జెక్టులో పిల్లగొల్ల రేష్మ 85/85, కొండేటి వైష్ణవి85/85, తియ్యల విజయ మహేశ్వరి 85/85 మార్కులతో ఘన విజయం సాధించారని తెలిపారు. 2026 ఫిబ్రవరి మార్చి సంవత్సరంలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఇసి, సిఈసి విభాగాల్లో ఉతీర్ణత సాధించిన శ్రీ విద్యాలయ జూనియర్ కాలేజ్ విద్యార్థినీ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థుల కృషి , అధ్యాపకుల నిబద్ధత,తల్లిదండ్రుల సహకారం ఈ విజయానికి కారణమని కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్ మళ్ళ నాగార్జున తెలియజేశారు, విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్స్ మన్నె అశోక్ గగపతిరాజు, పొనుగుమాటి రంజిత్ కుమార్,ఆళ్ల శివ ప్రసాద్, కళాశాల అద్యాపకులు,సిబ్బంది పాల్గొన్నారు.


