పేదల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం –వై. నాగేశ్వరరావు డీసీఎంస్ చైర్మన్
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: డోన్ పట్టణము డోన్ ఎమ్మెల్యే జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీసీఎంస్ చైర్మన్ వై. నాగేశ్వరరావు,టీడీపీ నాయకులు, ఎంపిడిఓ, ఎంఅర్ఓ , ఆఫీసర్స్, ఇతర సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం పేద మహిళలకు, అవ్వ తాతలకు, రైతులకు,, ఆటోడ్రైవర్స్ కి సూపర్ సిక్స్ పథకాలను అమలుచేసి, పేదల పక్షాన నిలిచారు. అలాగే అక్టోబర్ నుండి జిఎస్టీ చార్జెస్ తగ్గించడం జరిగింది. కరెంట్ బిల్ చార్జెస్ తగ్గించి పేదల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ద్యేయం అని నిరూపించిన ప్రభుత్వం. అనంతరం ప్రతి ఒక్కరికి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణి చేశారు.


