NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు  జీజీహెచ్​ లో పలు వార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సూపరింటెండెంట్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు  నేడు ఆసుపత్రిలోని పలు వార్డులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవలు, పారిశుధ్యం, వైద్య సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు.తనిఖీల సందర్భంగా ప్రతి రోగికి సంబంధించిన ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు (EHR – Electronic Health Records) అన్ని మాడ్యూల్స్ లో తప్పనిసరిగా పూర్తి స్థాయిలో నమోదు చేయాలని వైద్యుల, సిబ్బందిని ఆదేశించారు. రోగి ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి చికిత్స, పరీక్షలు, మందుల వివరాలు, డిశ్చార్జ్ వరకు ప్రతి సమాచారం EHRలో సక్రమంగా నమోదు చేయడం ద్వారా వైద్య సేవలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించవచ్చని తెలిపారు.అలాగే సాంకేతిక లోపాలను అడిగి తెలుసుకునీ సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.వైద్యులు, నర్సింగ్ మరియు ఇతర సిబ్బంది EHR నమోదులో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించరాదని, ప్రతి రోగి వివరాలు ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ హెల్త్ విధానంలో EHR కీలక పాత్ర పోషిస్తుందని, అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా వార్డుల్లోని రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ గారితో పాటు  డిప్యూటీ CSRMO డా వి పద్మజ, డా వెంకటరమణ,  అసోసియట్ ప్రొఫెసర్ డా రామాంజనేయులు, RMO డా క్లింటన్ మరియు ఇతర ఆసుపత్రి అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *