NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు..తీసుకొస్తాం..

1 min read

ప్రభుత్వ రాయితీలు వినియోగించుకుని పెట్టుబడులు పెట్టాలి

అభివృద్ధిని జీర్ణించుకోలేక వైసీపీ నాయ‌కులు త‌ప్పుడు వార్త‌లు రాయిస్తున్నారు

రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్

కర్నూలు న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని వస్తున్నదని, పరిశ్రమ వర్గాలకు రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తున్నదని, ఈజ్ ఎఫ్ డూయింగ్ బిజినెస్ సర్వే లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలని మంత్రి టి జి భరత్ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు.   సోమవారం  కర్నూలు నగరంలోని  తనిష్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర పరిశ్రమల శాఖ వారు ఏర్పాటుచేసిన సులభతర వాణిజ్య కార్యక్రమం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) సమావేశంలో పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ మాట్లాడుతూ… రాష్ట్రంలో గత15 నెలల్లో పరిశ్రమల వర్గాలలో ఒక దృఢమైన  నమ్మకాన్ని తీసుకుని రాగలిగామన్నారు.

పరిశ్రమలను ప్రోత్సహిస్తాం..

2018 సంవత్సరంలో దావోస్ లో అర్సలర్ మిట్టల్  కంపెనీ వారు  ఒరిస్సా రాష్ట్రానికి వెళ్లి పెట్టుబడులు పెడతామని చెప్పడం జరిగిందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్  చొరవ వల్ల   మిట్టల్ కంపెనీ మన రాష్ట్రానికి వస్తోందని,  అది కేవలం నారా చంద్రబాబు నాయుడుకే సాధ్యమన్నారు.  ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ బిజినెస్ జరుగుతూ ఉన్నదని, వాటి ఫలితాలు వస్తూ ఉన్నాయని మంత్రి తెలిపారు.  2018 లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జయరాజ్ ఇస్పాత్ కు భూమి పూజ చేశారని, ఆ సమయంలో వారికి నీటి సౌకర్యం, మరికొన్ని ప్రోత్సాహకాలు కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగిందని, ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వారికి నీటి సౌకర్యం కల్పించే చర్యలు, ప్రోత్సాహకాలు అందిస్తూ ఉందన్నారు.   వచ్చే రెండు నెలలు  దాదాపు రూ. 5 వేల నుండి  6 వేల  కోట్లు ఇన్సెంటివ్స్ పరిశ్రమలకు క్లియర్ చేయబోతున్నామని మంత్రి  టిజి భరత్ వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

About Author