NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎమ్మెల్యే కోట్ల

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు:  ప్యాపిలి మండలంలోని  చిన్న పొద్దిళ్ళ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం డోన్ ఎమ్మెల్యే  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న బోధన విధానం, మౌలిక వసతులు, పరిశుభ్రత, అలాగే మధ్యాహ్న భోజన పథకం అమలును సమగ్రంగా పరిశీలించారు.పాఠశాల నిర్వహణలో ఉన్న లోపాలపై సంబంధిత అధికారులతో చర్చించి, వెంటనే సరిదిద్దాలని సూచించారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో,తెదేపా మండల ఇన్చార్జి ఎద్దుల దొడ్డి ప్రభాకర్ రెడ్డి, తెదేపా నాయకులు కమతం భాస్కర్ రెడ్డి మరియు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author