పిజిఆర్ యస్ లో అందిన అర్జీలు పరిష్కారంపై అధికారులు దృష్టి పెట్టాలి..
1 min read

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీదారులతో మాట్లాడి చక్కని పరిష్కారం చూపాలి
అర్జీలు రీ-ఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలి
పిజిఆర్ యస్ లో వచ్చిన అర్జీలు 441
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టరరు కె.వెట్రిసెల్వితో పాటు జిల్లా జాయింటు కలెక్టరు పి.ధాత్రిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్,యస్ డిసి కె.భాస్కర్, జెడ్పీ సిఈవో యం.శ్రీహరి, డిఆర్డీఏ పిడి ఆర్.విజయరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడి యం.ముక్కంటి, సర్వే సహాయ సంచాలకులు అన్సారీ, నగరపాలక కార్పొరేషన్ కమీషనరు ఏ.భాను ప్రతాప్ లు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని,క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు.శాఖలు వారీగా వచ్చిన అర్జీలను పరిశీలించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. అర్జీలు పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు.పిజిఆర్ యస్ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలను క్షేత్రస్థాయిలోనే చక్కని పరిష్కార మార్గాలు చూపించి అర్జీలు రీ-ఓపెన్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు,జిల్లా కలెక్టరేటు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


