NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అనాధలు, వృద్ధులు, నిరుపేదలకు అండగా స్వామి వివేకానంద ట్రస్ట్

1 min read

– 50వ నెల నిత్యవసర సరుకుల పంపిణీ

హోళగుంద న్యూస్ నేడు: ఆదోని పట్టణానికి చెందిన స్వామి వివేకానంద ట్రస్ట్, భారత్ యూత్ అసోసియేషన్ హోళగుంద వారి ఆధ్వర్యంలో అనాధలు, వృద్ధులు మరియు నిరుపేద కుటుంబాలకు ప్రతి నెల నిర్వహిస్తున్న సేవా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం భాగంగా 50వ నెలలో కూడా అర్హులైన కుటుంబాలకు నిత్యవసర సరుకులను అందజేశారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సమాజంలో ఉన్న అనాధలు, వృద్ధులు, వికలాంగులు మరియు ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సేవా భావంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇప్పటివరకు నిరంతరంగా కొనసాగుతూ అనేక కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తోందన్నారు.ఈ నెలలో మార్లమడికి గ్రామానికి చెందిన వృద్ధురాలు రాధమ్మ, అలాగే గ్రామానికి సేవలు అందిస్తున్న గోర్క నిరుపేద కుటుంబానికి, అలాగే హోటల్ ఈరన్న – ఎర్రమ్మ దంపతులకు నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ సరుకుల పంపిణీ ద్వారా వారికి కొంత ఉపశమనం కలిగిందని తెలిపారు.అలాగే వికలాంగుడైన మట్టి లక్ష్మన్న అనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబానికి ఇంతకుముందు అందజేస్తున్న నిత్యవసర సరుకులను నిలిపివేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఆయన మరణంపై వారు సంతాపం వ్యక్తం చేశారు.ఇకపై కూడా అర్హులైన నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించే విధంగా ప్రతి నెల నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సేవా కార్యక్రమం సమాజంలో ఉన్న దాతలు మరియు సహృదయుల సహకారంతో విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు మాట్లాడుతూ సమాజంలో ఉన్న బాధితులకు చేయూతనివ్వడం ద్వారా నిజమైన మానవత్వాన్ని చాటవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో ఎం, రవికాంత్, శ్రీధర్ శెట్టి, ఎం, సంజీవి, తదితరులు పాల్గొన్నారు.

About Author