NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

1 min read

హోళగుందన్యూస్ నేడు: శ్రీ బాపూజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో విద్యార్థులతో మహిళా దినోత్సవం కార్యక్రమం జరపడం జరిగినది ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీ లక్ష్మన్న మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని నేటి బాలలే రేపటి పౌరులుగా రాబోయే తరంలో ఆడపిల్లలు ఒక మంచి డాక్టర్ గా లాయర్ గా టీచర్ గా కలెక్టర్ గా ఇంజనీర్లుగా అన్ని రంగాలలో ముందుండాలని చెప్పారు ఈరోజు మహిళలపై దౌర్జన్యాలు అత్యాచారాలు అవమానాలు చాలా జరుగుతున్నాయని వీటన్నింటినీ ఎదుర్కొని మహిళలు ధైర్యంగా నిలబడాలని అన్ని రంగాలలో మహిళలు ముందుండాలని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చంద్రావతి మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని బాగా చదువుకుని గొప్ప గొప్ప స్థాయిలో ఉండాలని ఈ దేశానికి సేవ చేయాలని మరియు అన్ని సమస్యలని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్లాలని చెప్పారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ గోల్ ని చెప్తూ వారు వారు ముందు తరాలకు మార్గదర్శకం కావాలని భారీ వారి వేషాధారణాలతో అలంకరించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాలు మరియు శ్రీ బాపూజీ ఇంగ్లీష్ మీడియం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author