రాఘవేంద్రుని మహా రథోత్సవం లో పాల్గొన్న టిడిపి ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి
1 min read

మంత్రాలయం , న్యూస్ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 354 వ మహా రథోత్సవం లో పాల్గొనేందుకు మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి, టిడిపి యువనాయకులు మాధవరం రాఖేష్ రెడ్డి, రాజారెడ్డి వచ్చారు. వీరికి స్థానిక టిడిపి నాయకులు మఠం అధికారులు స్వాగతం పలికారు. ముందు గా గ్రామదేవత మంచలమ్మ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు ఆశీస్సులు ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చావిడి వెంకటేష్,ఎంపిటిసి మేకల వెంకటేష్, మంచాల సొసైటీ డైరెక్టర్స్ డీసీ.తిమ్మప్ప, చాపల నాగేష్,వరదరాజు,పవన్, రఘు,నరసింహులు,మేకల నరసింహులు,రవి, రమేష్, గురురాజ్, చంద్ర, కూటమి నాయకులు,కార్యకర్తలు, రాకేష్ రెడ్డి యూత్ పాల్గొన్నారు.


