కమనీయం మంత్రాలయ నివాసి మహా రథోత్సవం
1 min read

హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించిన పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు
శ్రీరాముడి అలంకరణలో ప్రహ్లాదుడు
మూల బృందావనానికి నవరత్నాల కవచం అలంకరణ
మంత్రాలయం పురవీధుల్లో ఊరేగిన ప్రహ్లదరాయలు
విశేషంగా తరలివచ్చిన భక్తులు.
కన్నులపండువగా ఉత్తరారధన, వసంతోత్సవం
ఆకట్టుకున్న భక్తుల నృత్యాలు, వేషధారణలు , యువతి యువకులు కోలాటాలు
మంత్రాలయం, న్యూస్ నేడు : పవిత్ర తుంగభద్ర నది ఒడ్డున జీవసమాధి అయిన కలియుగ కల్పతరువు మంత్రాలయ నివాసి రాఘవేంద్ర స్వామి మహారథోత్సవం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో మంగళవారం కమనీయంగా జరిగింది. ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి తెల్లవారుజామున నుండి వివిధ విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు నడుమ రాఘవేంద్ర స్వామి మహారథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. హెలికాప్టర్ నుండి పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు మహా రథోత్సవం పై పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామి పూర్వతరం ప్రహ్లాద రాయలను శ్రీరామ అవతారంలో అలంకరించారు. సాంప్రదాయ ప్రాకారం ముందుగ పల్లకిలో స్వామివారిని గురుసార్వభౌమ సంస్కృత విద్యాపీఠానికి ఊరేగుంపుగా తీసుకెళ్ళారు. అక్కడ వేద పండితులు, విద్యార్థులు స్వామివారికి వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం రాఘవేంద్ర స్వామీ మూల బృందావన వద్ద పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు స్వామి బృందావనానికి, రంగులు చల్లి వసంతోత్సవం నిర్వహించారు. మంగళ హారతి ఇచ్చి ప్రహ్లాద రాయలకి వసంతోత్సవం, మంగళ హారతి ఇచ్చి భక్తులపై రంగులు చల్లారు. రామ అవతారం లో ఉన్నా ప్రహ్లాద రాయలను మహారథోత్సవం దగ్గరకు చేర్చారు. మహారథంపై స్వామీ వారిని కొలువుదీర్చి ఊరేగింపును ప్రారంభించారు. రాఘవేంద్ర స్వామి మఠం నుండి రాఘవేంద్ర సర్కిల్ మీదుగా శ్రీ మఠం వరకు పురవీధుల్లో ఊరేగించారు. ప్రధాన కూడలి రాఘవేంద్ర సర్కిల్ మీదుగా తిరిగి మఠం వరకు ఊరేగించారు. ఊరేగింపులో రథం ముందు భక్తులు కోలాటాలు, భక్తి నృత్యాలు, వేషధారణలు, భక్తి భజనలు, కీర్తనలు ఆకట్టుకున్నాయి. రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి నవరత్నాల కవచం అలంకరణ, మహా మంగళ హారతి ఇచ్చారు. మూల రాముల పూజలు , విశేషా అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు మాట్లాడుతూ.. వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలన్నారు. మంత్రాలయం కు ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు తో పాటు మరింత అభివృద్ధి చెందాలని కోరారు. మంత్రాలయం భక్తులు , ప్రభుత్వాల సహకారం తో మరింతా అభివృద్ది చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఏఓ మాధవ శెట్టి, మేనేజర్ ఎస్ కే శ్రీనివాస్ రావు, వెంకటేష్ జోషి, శ్రీపతి, ఐపి నర్సింహులు, అనంత స్వామి, ఇంజనీర్ సురేష్ కోనాపూర్, ధార్మిక సిబ్బంది వ్యాసరాజాచార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రథోత్సవం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు మేరకు డిఎస్పీ భార్గవి నేతృత్వంలో మంత్రాలయం సిఐ రామాంజులు పర్యవేక్షణలో మంత్రాలయం ఎస్సై శివాంజులు, మాధవరం ఎస్సై విజయ కుమార్ తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.




