బళ్లారిలో చికిత్స పొందుతున్న మల్లమ్మకు పెన్షన్ అందజేసిన టీడీపీ నాయకుడు
1 min read
వెటర్నరీ నాగార్జునతో కలిసి బళ్లారికి వెళ్లి మానవత్వాన్ని చాటుకున్న టీడీపీ నాయకుడు
హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామానికి చెందిన మల్లమ్మ అనారోగ్యంతో బళ్లారిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు బి.కే. వీరేష్, వెటర్నరీ నాగార్జునతో కలిసి బళ్లారికి వెళ్లి ఆమెకు ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా పెన్షన్‌ను స్వయంగా అందజేశారు.అనారోగ్య కారణంగా గ్రామానికి వచ్చి పెన్షన్ తీసుకునే పరిస్థితి లేకపోవడంతో, లబ్ధిదారురాలు ఇబ్బంది పడకుండా ఆమె ఉన్న చోటుకే వెళ్లి పెన్షన్ అందించడం పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బి.కే. వీరేష్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా తెలుగుదేశం పార్టీ నాయకులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.మల్లమ్మ కుటుంబ సభ్యులు బి.కే. వీరేష్, వెటర్నరీ నాగార్జునలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.



