ఇసుకపల్లిలో మంగళవారం నుండ తితిదే ధార్మిక కార్యక్రమాలు
1 min read
డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తి.తి.దే.
కర్నూలు, న్యూస్ నేడు: తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఆధ్వర్యంలో శిరివెళ్ళ మండలం, ఇసుకపల్లి గ్రామంలోని శ్రీ శివరామాలయం నందు మంగళవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6-00 గం. నుండి మూడు రోజుధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన, శనివారం భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కన్నీరు విల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఎందుకు సంబంధించిన కరపత్రాలను స్థానిక భక్త సమాజంతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్త సమాజం సభ్యులు కొత్తపు నరసింహారెడ్డి, లింగాల వెంకట నారాయణ రెడ్డి, ఎన్. వెంకట సుబ్బారెడ్డి, యం.వెంకటశివుడు యాదవ్, ఎన్. శ్రీనివాసులు యాదవ్, ఎల్. వెంకటేశ్వర్లు యాదవ్, పి. రమణమూర్తి యాదవ్, కె. సుబ్రహ్మణ్యం, కె. సుబ్రహ్మణ్యం శెట్టి, యం. వెంకటేశ్వర్లు యాదవ్, కె. పుల్లమ్మ, కె. పార్వతి, ఎన్. రాములమ్మ, యం. రామలక్ష్మమ్మ, ఎన్. లక్ష్మిదేవి, పి. చిన్న లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.



