ఆటంకం లేకుండా తాగునీటి సరఫరా…
1 min read

నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూలు, న్యూస్ నేడు: శనివారం నగరంలోని సంతోష్ నగర్ వద్ద పైప్‌లైన్ లీకేజీ కారణంగా తాగునీటి సరఫరాకు ఏర్పడిన ఆటంకాలను త్వరితగతిన అధిగమించి, సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు అధికారులు అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా ఇంజనీరింగ్ విభాగ అధికారులు, అమెనిటీస్ కార్యదర్శులతో తాగునీటి సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. శుక్రవారం నుండి తాగునీటి సరఫరా ప్రారంభమవ్వగా, మూడు రోజులపాటు నీళ్ళు లేకపోవడం వల్ల దూర ప్రాంతాలకు నీళ్ళు వెళ్ళేందుకు సమయం పడుతుందన్నారు. ఫిర్యాదు చేసిన సుమారు 60 ప్రాంతాల ప్రజలకు ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల నీళ్ళను అందిస్తున్నామని, ఆదివారం రాత్రిలోపు నగర వ్యాప్తంగా తాగునీటి సరఫరా చక్కబడుతుందన్నారు. పరిస్థితి అదుపులో వచ్చేంతవరకు అధికారుల పర్యవేక్షణ నిరంతరాయంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు.

