రెండేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్నాం
1 min read
రెండేళ్ల పాలనపై ఇంటింటికి వెళ్లి వివరించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్
కర్నూల్లో 6వ వార్డులో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం
కర్నూలు, న్యూస్ నేడు: రెండేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా చెప్పారు. కర్నూలు నగరంలోని 6వ వార్డులోని కమేలా వద్ద నుండి ఇంటింటికీ వెళ్లి ఆయన ప్రజలను కలిశారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల కాలంలో చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. జిల్లాకు కంపెనీలు తీసుకొస్తున్నట్లు యువతతో అన్నారు. ఇప్పుడు వస్తున్న కంపెనీలు గ్రౌండిగ్ అయితే ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. రానున్న రోజుల్లో ఓర్వకల్లుకు భారీగా పరిశ్రమలు వస్తాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. తల్లికివందనం పథకం ద్వారా ఎంత మంది పిల్లలున్నా అందరికీ డబ్బులు పడుతున్నాయన్నారు. మంత్రి టీజీ భరత్ ముందస్తు పుట్టినరోజు వేడుకలను స్థానిక నాయకులు వార్డులో నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడమే కాకుండా మహిళలకు మంత్రి చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు నాయకులు, బూత్ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.



