ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని హుసేనాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం ఆపాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ అన్వర్ బాష అధ్యక్షతన నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులే సమ సమాజ నిర్మాతలు అని ఉద్ఘాటించారు. తదుపరి పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం హోస ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందిన తెలుగు ఉపాధ్యాయులు బి.సర్వజ్ఞ మూర్తి ని పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు పూర్వ విద్యార్థుల సంఘం వారు కలిసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి ఆర్థికంగా సహకరించిన పూర్వ విద్యార్థి జెర్రిబండ వెంకట్రామిరెడ్డి కి ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు నరసింహుడు పాఠశాల కమిటీ చైర్మన్ రవికుమార్,తిమ్మారెడ్డి, రామకృష్ణారెడ్డి,మరియు లక్ష్మీనారాయణ గౌడ్ పాల్గొన్నారు.

