శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల లో టీచర్స్ డే
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల నందు టీచర్స్ డే ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది . ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ బి హరి కిషన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం గురించి తెలియజేయడం జరిగింది. టీచర్స్ ని గౌరవించడం వారు చెప్పేటువంటి విలువలను పాటించి జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ అడ్వైజర్ వసంత కుమారి మరియు కళాశాల ప్రిన్సిపాల్ మద్దిలేటి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.


