NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీసరస్వతీ శిశు మందిరంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిరంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కార్యదర్శి బీసీ విజయ్‌కుమార్ రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ రాధాకృష్ణన్ గొప్ప విద్యావేత్త, పండితుడు, ఉపాధ్యాయుడు, ప్రొఫెసర్‌గా సేవలందించడంతో పాటు ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా దేశానికి సేవ చేశారని తెలిపారు. అనంతరం వాసు, జయంతి లక్ష్మిలను సన్మానించారు.విద్యార్థులు ఉపాధ్యాయులకు పాదాభివందనం చేసి గురువుల పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు. జాహ్నవి అనే విద్యార్థిని ఉపాధ్యాయురాలిగా నాలుగో తరగతి విద్యార్థులకు పాఠం బోధించగా, ఇతర విద్యార్థులు కూడా ఆచార్యులుగా మారి పాఠాలు బోధించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఆచార్య బృందం, బాలబాలికలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *