NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్ ఎస్ఎస్  ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్యాపిలిలో ఎన్ ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం మాట్లాడుతూ గురువు కేవలం పాఠాలు బోధించే వ్యక్తి మాత్రమే కాకుండా, విద్యార్థుల జీవితానికి దిశానిర్దేశం చేసే మార్గదర్శి అని అన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ ఉపాధ్యాయులను గౌరవించి, వారి సూచనలను పాటించడమే నిజమైన గురుదక్షిణ అని పేర్కొన్నారు.కళాశాలలో ప్రతి సంవత్సరం ఒక అధ్యాపకుడిని సన్మానించే ఆనవాయితీలో భాగంగా ఈ ఏడాది వాణిజ్య శాస్త్ర అధ్యాపకుడు వెంకటరమణను ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో ఎన్ ఎస్ఎస్ పిఓ  నవీనపాటి, అధ్యాపకులు ముస్తాక్, శంకరయ్య, మద్దిలేటి, వెంకటేశ్వర్లు, మురళీమోహన్ గౌడ్, ఓబులేసు, వన్నూర్ తదితరులతో పాటు ఎన్ ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *