NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పింఛన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్                                           

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:   కర్నూలు జిల్లా పత్తికొండ మండలం దూదేకొండ గ్రామంలో  నూతనంగా  మంజూరైన ఎన్టీఆర్ సామాజిక వితంతు పెన్షన్ ను జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు.  అనంతరం కనకదిన్నె గ్రామం వద్ద నిర్మిస్తున్న ఇంటిగ్రేడ్ టమోటో జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులను కలెక్టర్ రంజిత్ భాష ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్ పరిశీలించారు. రైతులకు ఈ సీజన్లోనే టమోటో పరిశ్రమను అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ కు కలెక్టర్ ఆదేశించారు. మూడు నెలలలోని జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఆరవ తరగతిలో విద్యార్థినీ విద్యార్థులకు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష పాఠాలు బోధించారు. పిల్లలకు మంచి విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. అనంతరం పందికోన రిజర్వాయర్ ను కలెక్టర్ పరిశీలించారు. పందికొన రిజర్వాయర్ పెండింగ్ పనుల కోసం 250 కోట్ల పనులు పూర్తి చేసి 1.8 టిఎంసిల నీటిని రిజర్వాయర్లో నిలువ ఉండేటట్లు చేస్తామన్నారు. కుడి ఎడమ కాలువల ద్వారా రైతులకు సాగునీరు, పత్తికొండ మండల పరిధిలోని గ్రామాలకుతాగునీరుఅందిస్తామన్నారు. పందికోన నుండి పత్తికొండ బయలుదేరిన కలెక్టర్ ఆకస్మికంగా పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ  భరత్ నాయక్ , ఎమ్మార్వో హుస్సేన్ సాహెబ్, ఎంపీడీవో కవిత రెవెన్యూ అధికారులు మండల అధికారులు, హెచ్ఎంఎస్ కెనాల్ సిబ్బంది, టిడిపి నాయకుల పాల్గొన్నారు.

About Author