మూడు నెలల్లో లబ్ధిదారులకు టీడ్కో గృహాలు
1 min read

ఎమ్మెల్యే బడేటి చంటి
నష్టపోయిన టిట్ కో గృహాల లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో న్యాయం
జూన్ నెలాఖరికి లబ్ధిదారులకు అందజేస్తాం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: గత వైసిపి ప్రభుత్వ విధ్వంసకర పాలనలో తీవ్రంగా నష్టపోయిన టిడ్కో గృహాల లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో న్యాయం చేస్తుందని, వచ్చే జూన్ నెలాఖరికి టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేస్తామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి భరోసా ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేయలేని వారికి ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పోణంగి రోడ్ లో నిర్మిస్తున్న టిడ్కో గృహాలను శరవేగంగా పూర్తి చేయించి లబ్ధిదారులకు అందించి వారి కళల్లో ఆనందాన్ని చూడాలని తాపత్రయ పడుతున్నారు. దీనిలో భాగంగానే టిడ్కో గృహాల పనులను పరుగులు పెట్టేలా అధికారులకు పలు సూచనలు చేస్తూ వస్తున్నారు. మంగళవారం స్వయంగా ఎమ్మెల్యే బడేటి చంటి పోణంగి రోడ్డు లోని టిడ్కో గృహాలను పరిశీలించారు. పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మీడియాతో మాట్లాడుతూ
2014-19 మధ్యకాలంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పేద ప్రజలు సుఖశాంతులతో జీవించడానికి నాణ్యమైన గృహాలను అందించాలని నిర్ణయించి పోణంగి, కొత్తూరు, మాదేపల్లిలో దాదాపు 6486 టిడ్కో గృహాలకు శంకుస్థాపన చేసిందని తెలిపారు. ఈ గృహాల నిర్మాణం పురోగతిలో ఉండగా ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిడ్కో గృహాలను నిర్వీర్యం చేసే విధంగా చర్యలు తీసుకుందని ధ్వజమెత్తారు. కేవలం విధ్వంసం తప్ప ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టిడ్కో గృహాలను పూర్తి చేయకపోగా చివరకు లబ్ధిదారులను కూడా మోసం చేశారని ఆరోపించారు. ఈ ఇళ్లను కూడా తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని లబ్ధిదారులను నిలువు దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. డీడీలు కట్టిన పాపానికి లబ్ధిదారులు బ్యాంకు నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితితోపాటు సిబిల్ స్కోర్ పడిపోయి వారికి మళ్ళీ రుణాలు వచ్చే అవకాశం లేకుండా పోయిందని ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. వచ్చే నెల ఏప్రిల్ లో డీడీలు కట్టిన ప్రతి ఒక్కరికి ఆ మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా పోణంగి, కొత్తూరులో నిర్మిస్తున్న టిడ్కో గృహాలను జూన్ నెలకి లబ్ధిదారులకు అందించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసి విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, బిజెపి జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, చోడే వెంకటరత్నం, నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు, క్లస్టర్ ఇంచార్జ్ పైడి వెంకట్రావు, కో క్లస్టర్ ఇంచార్జ్ మెరుగుమాల శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు గొంగాడి సాంబశివరావు, తెర్లి వెంకన్న, ఆర్నేపల్లి తిరుపతి, పూజారి నిరంజన్,ఏ ఏన్ ఆర్ నాగేశ్వరరావు, టిడ్కో గృహాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణరావు, ప్రాజెక్టు మేనేజర్ కృష్ణమూర్తి, ఏఈలు పూర్ణచంద్ర కుమార్, సాయిబాబా మరియు బిజెపి నాయకులు నడపన భాస్కరరావు, జనసేన నాయకులు వీరంకిపండు మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


