దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో “దివ్యాంగ శక్తి” పథకం ప్రారంభం
1 min read

జండా ఊపి లాంచనంగా ప్రారంభించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
దివ్యాంగుల సంక్షేమానికి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ కూటమి ప్రభుత్వం మరింత అండగా నిలుస్తోంది
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగుల సంక్షేమానికి తోడ్పడుతూ, వారిలో ఆత్మ స్థైర్యాన్ని మరింత నింపుతూ మన కూటమి ప్రభుత్వం వారికి మరింత అండగా నిలిచింది. దేవుడు మనిషికి ఏదైనా లోపాన్ని ఇస్తే, వారిలో కచ్చితంగా అంతకు మించిన మరో నైపుణ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. మీలో ఉన్న ఆ నైపుణ్యాన్ని వెలికితీయండి – కూటమి ప్రభుత్వం మీ సంక్షేమానికి మరింత అండగా నిలుస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడిoచ్చారు. పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయం వద్ద “దివ్యాంగశక్తి”పథకాన్ని లాంఛనంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు.దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందిస్తూ ఏర్పాటు చేసిన తొలి బస్సు కు జెండా ఊపి మహిళా శక్తి పధకం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.శనివారం నుంచి దివ్యాంగుల కొరకు దెందులూరు లో ప్రత్యేక నియోజకవర్గస్థాయి సదరం శిబిరం నిర్వహించినట్లు వెల్లడించారు.దెందులూరు నియోజకవర్గంలో ప్రతి నెల 4697మంది దివ్యాంగులకు ఫించన్లు రూపేణ రూ.2కోట్ల 88లక్షల 36వేల రూపాయలను ప్రతి నెల ఒకటవ తేదీన వారి ఇంటి వద్దకే ఇచ్చి దివ్యాంగులకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వంకి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దెందులూరు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గారపాటి రామసీత, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బొప్పనసుధ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పలపాటి రాంప్రసాద్, వడ్డీ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు మోరు శ్రావణి, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ యాదవ్, జిల్లా డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి , పెదవేగి ఎంపీడీవో నాగేంద్ర కుమార్, మండల పార్టీల అధ్యక్షులు మరడాని రవి, నంబూరి నాగరాజు, తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని, క్లస్టర్ ఇంచార్జ్ గుత్త అనిల్, సొసైటీల అధ్యక్షులు తాత సత్యనారాయణ, గారపాటి కొండయ్య చౌదరి, కొనకళ్ళ శివమణి, డా.పసుమర్తి మధు, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి గుడిపూడి రేవతి, మహిళా విభాగం నాయకురాలు వడ్డీ వాసవి దేవి, జనసేన నాయకులు గరికపాటి చంటి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పసుపులేటి భార్గవ్, కూటమి నాయకులు మంచినేని శ్రీనివాస్, ఇప్పిలి వెంకటేశ్వరరావు (వై.వి.ఆర్), కమ్మ శివరామ కృష్ణ, మన్నె శ్రీనివాసరావు,చేకూరి భగవాన్, నక్కలపూడి సురేష్ బాబు, సహా పలువురు ప్రజా ప్రతినిధులు కూటమి నాయకులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


